పెట్రోల్ సమస్య కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.... జేసీ

0చూసినవారు
పెట్రోల్ సమస్య కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు.... జేసీ
జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాల రైతులకు, వాహనదారులకు డీజిల్, పెట్రోల్ సరఫరాలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ, ఆక్వా రంగాల యంత్రాలు, వరి కోత మిషన్లు, రవాణా వాహనాలకు నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్