గణపవరం: చెరువులో పడి మరొకరు..

0చూసినవారు
గణపవరం: చెరువులో పడి మరొకరు..
కొత్తపల్లిలోని రొయ్యల చెరువులో పనిచేస్తున్న జగన్నాథపురం గ్రామానికి చెందిన డానియేల్ (47) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఈ నెల 28న ఇంటి నుంచి చెరువు వద్దకు వచ్చిన డానియేల్ మధ్యాహ్నం తర్వాత కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత, శుక్రవారం మధ్యాహ్నం చెరువులో ఆయన మృతదేహం బయటపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై మణి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you