జనసేన సభ్యత్వ నమోదు.. భీమవరంలో చంద్రశేఖర్ ప్రారంభం

3చూసినవారు
జనసేన సభ్యత్వ నమోదు.. భీమవరంలో చంద్రశేఖర్ ప్రారంభం
ఏపీఐఐసీ డైరెక్టర్, జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, జనసేన పార్టీ సభ్యత్వ నమోదును మహోన్నత ఆశయాలతో కూడిన యజ్ఞంగా అభివర్ణించారు. బుధవారం భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు స్టాల్ ను ఆయన ప్రారంభించారు. గత ఏడాది భీమవరం నియోజకవర్గంలో 17 వేల సభ్యత్వాలు నమోదయ్యాయని, ఈ ఏడాది అత్యధిక సభ్యత్వాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం 5వ విడతగా ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్