భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం నాగేంద్రపురం ఓఎన్జీసి ఖాళీ స్థలంలో సుమారు రూ. 5 లక్షల విలువైన 1300 బాటిళ్ల అక్రమ మద్యం, నాటు సారాను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.