జూన్ 2 నాటికి రైతులకు పాసుపుస్తకాల పంపిణీకి సిద్ధంగా ఉంచాలి

2చూసినవారు
జూన్ 2 నాటికి రైతులకు పాసుపుస్తకాల పంపిణీకి సిద్ధంగా ఉంచాలి
జిల్లాలో డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి పొరపాట్లు లేకుండా బుక్ ప్రింటింగ్ పూర్తి చేసి జూన్ 2వ తేదీ నాటికి రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలోని మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో జాయింట్ ఎల్పీఎంలుగా ఉన్న భూముల విభజన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్