రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించే ‘పీఎం-రాహత్’ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరంలో పోలీస్, రెవెన్యూ, రవాణా, వైద్య శాఖల అధికారులతో పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం ప్రయోజనాలపై గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.