రాష్ట్ర సర్వోదయ మండలి పిలుపు మేరకు భీమవరం గాంధీ కస్తూరిబా భవనంలో బుధవారం స్వచ్ఛంద సంస్థల నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాంతి ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు వల్ల చిన్న దేశాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశం మహాత్మా గాంధీ మండపాలలో శాంతి ప్రార్థనలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా జరిగింది.