ఆర్టీసీ బస్సు టైర్ల నుంచి పొగలు

830చూసినవారు
ఆర్టీసీ బస్సు టైర్ల నుంచి పొగలు
భీమవరం నుంచి నరసాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరవాసరం తూర్పు చెరువు సెంటర్ వద్దకు చేరుకోగానే టైర్లు వేడెక్కి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ మహేష్ వెంటనే ప్రయాణికులను బస్సులోంచి దించి, మరో బస్సులోకి ఎక్కించారు. కొద్దిసేపు బస్సును అక్కడే నిలిపి ఉంచి, అనంతరం నరసాపురం డిపోకు తరలించారు. ఎండల తీవ్రత వల్ల టైర్లు వేడెక్కడం సహజమని డ్రైవర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్