సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా రెవెన్యూ అధికారి బి. శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి ఎ. వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్. వెంకటేశ్వరరావు ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీ పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు.