భీమవరంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

708చూసినవారు
భీమవరంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
భీమవరం జెపి రోడ్డులోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, బుధవారం 108 మంది మహిళా భక్తులు 108 తులసి మొక్కలతో తులసి బృందార్చన నిర్వహించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు పర్యవేక్షణలో అర్చకులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ బృందార్చన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భీమవరంలో ప్రత్యేక శోభను నింపింది.

సంబంధిత పోస్ట్