జిల్లాలో డీజిల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాకు రోజుకు 3 లక్షల లీటర్ల డీజిల్ అవసరం కాగా, ప్రస్తుతం 4.5 లక్షల లీటర్ల వరకు సరఫరా అవుతోందని వివరించారు. జిల్లా యంత్రాంగం డీజిల్ సరఫరాను సమన్వయంతో పర్యవేక్షిస్తోందని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.