భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను విజయవంతంగా అధిరోహించిన దివ్యాంగ విద్యార్థి ఏడీవీ సత్యనారాయణను అభినందించారు. పెంటపాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సత్యనారాయణ ఏప్రిల్ 30న 5,364 మీటర్ల ఎత్తులోని బేస్ క్యాంప్ను చేరుకుని రికార్డు సృష్టించారు. కడప, లడక్లలో కఠిన శిక్షణ పొందిన ఆయన ప్రతిభను కలెక్టర్ ప్రశంసించారు.