
ఇరాన్‌పై దాడి చేస్తే భయంకర పరిణామాలు: పుతిన్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య 90 నిమిషాల సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగితే భయంకర పరిస్థితులు ఎదురవుతాయని పుతిన్ ట్రంప్‌ను హెచ్చరించారు. ఇరాన్ యురేనియం నిల్వలను తాము తీసుకుంటామని పుతిన్ ప్రతిపాదించగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితేనే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తానని ట్రంప్ షరతు విధించారు. ఈ సంభాషణ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలకు ఊపిరి పోసింది.




