
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఒకరి మృతి
TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ బస్సును, బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తిరుపతి రిటైర్డ్ డీఎస్పీ కుమారుడు అశోక్ రెడ్డి మృతిచెందగా, మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.




