ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా కమిటీ నేతలు బుధవారం భీమవరంలో జిల్లా విద్యాశాఖాధికారి, ఖజానాధికారికి వినతిపత్రాలు సమర్పించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. ఎస్. విజయరామరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడిని తగ్గించాలని కోరారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన రెమ్యునరేషను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.