రెండు రోజుల్లో జనాభా గణన పూర్తి చెయ్యాలి

11చూసినవారు
రెండు రోజుల్లో జనాభా గణన పూర్తి చెయ్యాలి
జిల్లాలో కొనసాగుతున్న జనాభా గణన–2027లో భాగంగా గృహ గణన నమోదు ప్రక్రియను వచ్చే రెండు రోజుల్లో నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, తక్కువ ప్రగతి ఉన్న మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో మాట్లాడుతూ, ఒక్క గృహం కూడా నమోదుకు మిగలకుండా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు. యుఎస్ఎఫ్ సర్వే గణాంకాలకు అనుగుణంగా ప్రస్తుత గృహ గణన గణాంకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్