జిల్లాలో డీజిల్ కొరత లేదు

3చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లాలో డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కొరత ఉందనే వార్తల్లో నిజం లేదని పౌరసరఫరాల శాఖ అధికారి సరోజ తెలిపారు. వ్యవసాయ కోతల కాలం, ఆక్వా అవసరాల దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా కూపన్ల ద్వారా డీజిల్ సరఫరా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. బంకులలో నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డీజిల్ అయిపోతుందని క్యాన్లలో పెట్రోల్ నిల్వ చేసుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్