48 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండవు... కలెక్టర్

566చూసినవారు
48 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండవు... కలెక్టర్
గత మూడు రోజులుగా రాష్ట్రంలోని నాలుగు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అత్యవసర విద్యుత్ కోతలు అమలు చేయాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. దీంతో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది. రాబోయే 48 గంటల పాటు జిల్లాలో ఎలాంటి విద్యుత్ కోతలు ఉండవని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కోతలు అవసరమైతే, వినియోగదారులకు కనీసం ఒక రోజు ముందుగానే సమాచారం అందిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్