తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి రూ. 10 లక్షలు, గ్రామస్తుల విరాళాల రూపంలో మరో రూ. 10 లక్షలు మొత్తం రూ. 20 లక్షలు సేకరించి, భూమి నష్టపోతున్న ఆరుగురు రైతులకు అడ్వాన్స్‌గా అందజేశారు.