అల్లూరి స్ఫూర్తితో పోరాట పటిమను కొనసాగించాలి...

17చూసినవారు
అల్లూరి స్ఫూర్తితో పోరాట పటిమను కొనసాగించాలి...
భీమవరం పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్‌లో గురువారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు పౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్