పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఉగాది నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు 9,135 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆమె ఆదేశించారు. గూగుల్ మీట్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య పాల్గొన్నారు.