
ఎనిమిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అత్యాచారం
ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఎనిమిదేళ్ల బాలికపై 55 ఏళ్ల రాములు అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక స్నేహితులతో ఆడుకుంటుండగా, రాములు ఆమెను ఇంట్లోకి పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


































