బుధవారం జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్‌షిప్‌లోని డాక్టర్ సర్జన్ నివాసంలో పాము కలకలం సృష్టించింది. పక్షుల గూడులోని గుడ్ల కోసం పాము ప్రవేశించడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయపడి స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం అందించారు. సొసైటీ ప్రతినిధి చదలవాడ క్రాంతి సంఘటనా స్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.