
సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు!.. వీడియో వైరల్
సరైన సమయానికి సీపీఆర్ చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు దక్కాయి. యూపీలో ఓ కార్మికుడు షాపు ముందు రేకులు అమరుస్తుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి వెంటనే అతడికి ప్రాణం తిరిగొచ్చే వరకు సీపీఆర్ చేస్తూనే ఉన్నాడు. బాధితుడు స్పృహలోకి రాగానే మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.




