చింతలపూడిలో క్లీన్ స్వీప్ కార్యక్రమం

1చూసినవారు
చింతలపూడి కమిషనర్ కె. రాంబాబు పాత చింతలపూడి గ్రామంలో క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలందరూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత వాతావరణాన్ని మెరుగుపరుస్తుందని, తడి, పొడి చెత్తను వేరు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :