గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ నెల 10 నుండి 16 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 10న స్వామివారి నిజరూప దర్శనం, 11న విశేష లక్ష తమలపాకుల పూజ, 12న సామూహిక హనుమద్ హోమం, 13న శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణం, గ్రామోత్సవం, 14న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, 15న సామూహిక హనుమద్ వ్రతం, 16న మహా పూర్ణాహుతి, చక్ర స్నానం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.