జంగారెడ్డిగూడెం మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్సై వీరప్రసాద్ అభినందించారు. బుధవారం స్థానిక మసీద్ సెంటర్ లో సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఎస్సై పేర్కొన్నారు.