కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని జులై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కోరింది. శనివారం జంగారెడ్డిగూడెంలో కార్మికులకు కర పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి మాట్లాడుతూ.. లేబర్ కోడ్లను సమర్థిస్తూ, 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచి క్యాబినెట్‌లో ఆమోదించడం కార్మికులకు వెన్నుపోటు పొడవటమేనని ఆవేదన వ్యక్తం చేశారు.