జంగారెడ్డిగూడెం పట్టణంలో మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. పలు బంకులు స్టాకు లేకపోవడంతో మూసివేశారు. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్దకు రాత్రి పగలు తేడా లేకుండా భారీగా వాహనాలు వస్తున్నాయి. బంకుల యాజమాన్యాలు అవసరం మేరకు మాత్రమే పెట్రోల్ కొడుతున్నారు.