జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు పంచహారతులను నివేదించారు.