IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ ఆదివారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ లో 140వ మే డే సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో రద్దు చేయబడిన 8 గంటల పని దినాన్ని తిరిగి అమలు చేసేంతవరకు మేడే ఉద్యమ స్ఫూర్తితో సమరశీల పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.