JRG: రహదారికి అడ్డంగా కూలిన వృక్షం తొలగింపు

3చూసినవారు
జంగారెడ్డిగూడెంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా రోడ్డుపై ఒక చెట్టు కూలిపోయింది. బుధవారం ఉదయం సమాచారం అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి, రోడ్డుపై కూలిన చెట్టును తక్షణమే నరికి, పక్కకు తొలగించారు. దీంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you