జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తేతలి దుర్గ నమఃశ్రీ, ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం, KGS అక్షర 597, K. దీపిక 594, P. తనుశ్రీ 594, S. పవన్ తేజ 592, V. సోహిత 591 మార్కులు సాధించారు.