జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని స్థానిక గోకుల తిరుమల పారిజాత గిరి జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి వైపు మొక్కల లోడుతో వెళుతున్న లారీ, అశ్వరావుపేట వైపు వెళుతున్న ట్యాంకర్ లారీ ఒకదానికొకటి ఎదురుగా ఢీకొన్నాయి. రోడ్డుపై గోతులు తప్పించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.