జంగారెడ్డిగూడెంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.