JRG: రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు

0చూసినవారు
JRG: రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
ఏలూరు జిల్లా రీజినల్ విజిలెన్స్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మంగళవారం జంగారెడ్డి మండలంలోని దేవులపల్లి, ఉప్పలమెట్టలో రేషన్ షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బియ్యం, పంచదార నిల్వల్లో భారీ వ్యత్యాసాలు గుర్తించారు. రూ. 8, 41, 541 విలువైన సరకును అధికారులు సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత డీలర్‌పై నిత్యావసర వస్తువుల చట్టం కింద 6(A) కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్