కామవరపుకోట మండలంలోని ఎరువుల దుకాణాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సూర్య ఆగ్రోస్‌లో స్టాక్ రిజిస్టర్‌కు, నిల్వ ఉన్న సరుకుకు మధ్య వ్యత్యాసం కనిపించడంతో ఆ దుకాణం లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏడీఏ సుబ్బారావు, ఏవో ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.