లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న మంగళవారం జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ₹. 85,050 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎస్సై హెచ్చరించారు.