జంగారెడ్డిగూడెం (M) దేవులపల్లికి చెందిన వడ్రంగి కార్మికుడు పారేపల్లి శేఖర్ (39) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. రోజులాగే పనికి వెళ్లిన ఆయన ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడిపోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, పదేళ్ల కొడుకు ఉన్నారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.