చింతలపూడి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఏలూరులో ఆర్ అండ్ బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చింతలపూడి-ఏలూరు, కామవరపుకోట, ధర్మాజీగూడెం, జీలకర్రగూడెం రహదారుల పనులను గడువులోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.