చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, అతివేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి డ్రైవర్‌కు సూచనలు ఇచ్చారు. పరిమితికి మించి వేగంగా వెళ్తే కఠిన చర్యలు తప్పవని, ప్రయాణికుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. బస్సు నడిపేటప్పుడు ఇద్దరు డ్రైవర్లు ఉండాలని, తాగి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులు కూడా బస్సు ఎక్కేముందు డ్రైవర్ మద్యం సేవించారా, లైసెన్స్ ఉందా, బస్సు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.