శుక్రవారం చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ సమగ్రత, ఐక్యతకు చిహ్నంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్త దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.