కామవరపుకోట మండలంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఎవరికీ ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని తడికలపూడి ఎస్సై చెన్నారావు సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పార్టీలు, అశ్లీల నృత్యాలు చేసినా, ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహనాలపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.