జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌కు నూతనంగా నియమితులైన ఏఎస్పీ సుస్మిత రామనాథన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె డీఎస్పీ రవి చంద్ర వద్ద నుంచి బాధ్యతలు తీసుకున్నారు. సబ్ డివిజన్ సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. అసాంఘిక కార్యక్రమాల నివారణకు సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని సుస్మిత రామనాథన్ తెలిపారు.