గురువారం చింతలపూడిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుల బృందం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే వారితో కలిసి నియోజకవర్గంలోని గ్రామ స్థాయి పరిస్థితులు, నాయకుల నుండి కార్యకర్తల వరకు ఉన్న అంశాలపై సమగ్రంగా చర్చించారు. పార్టీ బలోపేతం, కార్యాచరణ తీరు, భవిష్యత్ కార్యక్రమాలపై కూడా పలు సూచనలు, అభిప్రాయాలు తెలియజేశారు.