జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్ స్టాండ్ వైయస్సార్ విగ్రహం వద్ద గురువారం
వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపిస్తూ, వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.