దెందులూరు మండలం వేగవరం బాలల సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గివ్ బ్యాక్ కార్యక్రమంలో భాగంగా నూతన వస్త్రాలు, స్వీట్లు అందజేశారు. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంరక్షణ కేంద్రాల్లోని బాలికలకు శాలువాలతో తయారు చేయించిన దుస్తులు, బాలురకు రెడీమేడ్ దుస్తులు పంపిణీ చేసి, పండుగ వేళ వారికి ఆనందాన్ని పంచారు.