దెందులూరు: ఈనెల 10 నుంచి ప్రీమియర్ లీగ్

31చూసినవారు
దెందులూరు: ఈనెల 10 నుంచి ప్రీమియర్ లీగ్
యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడంలో క్రీడల ప్రాముఖ్యతను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నొక్కిచెప్పారు. గురువారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన చింతమనేని ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 10వ తేదీ నుంచి దెందులూరు హైస్కూల్ మైదానంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్