తణుకు పాతఊరులో మే 31న జరిగిన ఏలీషా హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విశ్వనాధ్ బుధవారం తెలిపారు. మల్లిపూడి ప్రదీప్ కుమార్, అతని కుమారులైన శశి కుమార్, దుర్గా లోకేశ్వరావు లు కలసి ఏలీషాను హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.