పెదపాడు మండలం కొత్తముప్పర్రు గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా ₹. 36 లక్షల అంచనా విలువతో నిర్మించనున్న హెల్త్ క్లినిక్ సెంటర్ మరియు ₹. 29 లక్షలతో నూతన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. అనంతరం, పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పెన్షన్లు పంపిణీ చేశారు.